విడుదల తేదీ : 19 సెప్టెంబర్ 2014 TeluguWorld.wap.sh : 3.25/5 దర్శకుడు : శ్రీను వైట్ల నిర్మాత : అనిల్ సుంకర – రామ్ ఆచంట – గోపి ఆచంట సంగీతం : ఎస్ఎస్ తమన్ నటీనటులు : హేష్ బాబు, తమన్నా....
’1-నేనొక్కడినే’ లాంటి డిఫరెంట్ ఫిల్మ్ ట్రై చేసిన తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. ‘దూకుడు’ తర్వాత శ్రీనువైట్ల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కూడా మహేష్ బాబు సరికొత్త యాటిట్యూడ్ తో టిపికల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. మొదటిసారి మహేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే, శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు మహేష్ బాబుతో చేస్తున్న 3వ సినిమా ‘ఆగడు’. భారీ అంచనాల నడుమ సుమారు 2000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకొని, బాక్స్ ఆఫీసు వద్ద ఆగడు ఆగకుండా దూసుకుపోతూ ‘దూకుడు’ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందా.? లేదా.? అనేది ఇప్పుడు చూద్దాం….
కథ :
శంకర్ (మహేష్ బాబు) ఓ అనాధ. కానీ చాలా తెలివైన కుర్రాడు. అతనిలోని టాలెంట్ చూసిన పోలీస్ ఆఫీసర్ రాజ నరసింగరావు(రాజేంద్ర ప్రసాద్) అతన్ని చేరదీసి పోలీస్ ఆఫీసర్ చెయ్యాలనుకుంటాడు.. కానీ అనుకోని కారణాల వల్ల శంకర్ ఒక కురాన్ని చంపేయడంతో రాజా నరసింగరావు శంకర్ తో తెగతెంపులు చేసేసుకుంటాడు..
మర్డర్ కేసులో అరెస్ట్ అయిన శంకర్ బోస్టన్ స్కూల్ లో చదివి పోలీస్ అవుతాడు.. అప్పుడే బుక్క పట్టణంలో దామోదర్ (సోనూ సూద్) చేస్తున్న అరాచకాలను అరికట్టడానికి శంకర్ ని బుక్క పట్టణం సిఐగా పంపిస్తాడు.. అక్కడికి వచ్చిన శంకర్ కి ఓ నమ్మలేని నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి.? దామోదర్ ఆగడాలను ఎలా అడ్డుకున్నాడు.? అలాగే శంకర్ చేసిన మర్డర్ వెనకున్న నిజా నిజాలేమిటి? అనేది మీరు తెరపైనే చూడాలి…
ప్లస్ పాయింట్స్ :
పోకిరి’ సినిమా నుంచి ప్రతి ఒక్క సినిమాలోనూ ఏదో ఒక రీతిలో కొత్తదనం చూపించడానికి ట్రై చేస్తున్న మహేష్ బాబు ఈ సినిమాలో కూడా సరికొత్త యాటిట్యూడ్, మానరిజమ్స్ తో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే మహేష్ బాబు ఈ సినిమాలో మాట్లాడిన రాయలసీమ యాస డైలాగ్స్ బాగా పేలడమే కాకుండా, ఆడియన్స్ ని థియేటర్లో కంటిన్యూగా విజిల్స్ కొట్టేలా చేసాయి. యాక్షన్ ఎపిసోడ్స్ లో తన డేరింగ్ చూపించిన మహేష్ ఈ సినిమాలో రెండుమూడు పాటల్లో మంచి స్టెప్స్ వేసి ఆడియన్స్ లో మరింత ఊపు తెప్పించాడు. మొదటిసారి మహేష్ తో జోడీ కట్టిన తమన్నాకి ఉన్నది చిన్న పాత్రే అయినా ఉన్నంత సేపూ మాత్రం ఆడియన్స్ తనవైపు తిప్పుకుంది. లంగా వోనీలో కుర్రకారుని ఆకట్టుకుంది. సీన్స్ లో లంగా వోనీలో కనిపించే తమన్నా పాటల్లో మాత్రం టోటల్ గ్లామరస్ లుక్ లో అందాలు ఆరబోసి బి, సి సెంటర్ ఆడియన్స్ ని మెప్పించింది.
మహేష్ తండ్రి పాత్రలో కనిపించిన రాజేంద్ర ప్రసాద్ తన పాత్రకి న్యాయం చేసాడు. ఇక ఈ సినిమా సెకండాఫ్ లో కీ రోల్ పోషించిన కామెడీ కింగ్, తన బట్ట – పొట్టతోనే నవ్వించగల బ్రహ్మానందం బ్రోకర్ పాత్రలో బాగానే నవ్వించాడు. బ్రహ్మానందంకి రాసిన కొన్ని ప్రాసతో కూడిన పంచ్ డైలాగ్స్ బాగానే పేలాయి. మహేష్ సినిమాలో కంటిన్యూగా కీ రోల్స్ చేస్తున్న నాజర్ కి ఈ మూవీలో ఓ డిఫరెంట్ రోల్ చేసాడు. ఈ పాత్ర ద్వారా నాజర్ వేసే వెటకారపు సెటైరికల్ డైలాగ్స్ బాగా పేలడంతో థియేటర్లో నవ్వుల జల్లులు కురిశాయి. వెన్నెల కిషోర్ కూడా సినిమా మొత్తం మహేష్ తో ట్రావెల్ అవుతూ నవ్వించాడు. పోసాని డైలాగ్ డెలివరీ అంటేనే నవ్వు ఆపుకోలెం, ఈ సినిమాలో పోసానికి రాసిన పంచ్ డైలాగ్స్ కూడా బాగానే నవ్వించాయి.
విలన్ గా సోనూసూద్ ఉన్నంతలో మెప్పించాడు. ఆ పాత్రని ఇంకాస్త స్ట్రాంగ్ గా రాసుకొని ఉంటే హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యేది. స్పెషల్ అప్పియరెన్స్ లో ముంతాజ్ కూడా బాగా చేసింది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్, టైటిల్ సాంగ్ చాలా బాగుంది. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా చాలా బాగుంది. సెకండాఫ్ లో వచ్చే ఓ ట్విస్ట్ ఆకట్టుకుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. సెకాండాఫ్ లో వచ్చే శృతి హాసన్ సాంగ్ ఆడియన్స్ లో ఊపు తెస్తుంది.. అలాగే శృతి హాసన్ గ్లామర్ డోస్ మరియు మాస్ స్టెప్స్ బి, సి సెంటర్స్ ఆడియన్స్ చేత విజిల్స్ వేస్తూ స్టెప్పులు వేయించింది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్ అంటే అనే సినిమా కథ – కథనం. కథలో చెప్పుకోదగిన పాయింట్ లేకపోవడం. ఇలాంటి కథలతో వచ్చిన చాలా సినిమాలను మనం ఇది వరకే చూసేయడం. పోనీ కథ పాతదే, చాలా సినిమాలను స్పూర్తిగా తీసుకొని రాసుకున్నారు అనుకుంటే కథనం అన్నా ట్విస్ట్ లతో ప్లాన్ చేసుకొని, అవి సరైన టైమింగ్ లో రివీల్ చేసుకొని ఉంటే హెల్ప్ అయ్యేది. అలా చేయకపోవడం వలన సినిమాలో ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుందనేది ముందే ఊహించేయవచ్చు. అన్నికంటే మించి సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సెకండాఫ్ యాసిటీజ్ ‘దూకుడు’ లానే ఉంది కదా అని పెదవి విరుస్తున్నారు.
సినిమా మొత్తం పాత్రలకి సంబంధం లేకుండా ప్రాసతో కూడిన పంచ్ డైలాగ్స్ వస్తుంటాయి. ఇవి కొన్ని చోట్ల బాగా పేలినా కొన్ని చోట్ల మాత్రం తుస్సుమన్నాయి. ఈ ప్రాస పంచ్ డైలాగ్స్ లో పెట్టిన శ్రద్ధ లో సగం కథ లేదా కథనం పై పెట్టి ఉంటే సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యేది. ఇకపోతే బ్రహ్మానందం కామెడీ కూడా చాలా చోట్ల వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో సిజి లో వేయించిన డాన్స్ స్టెప్స్. అలాగే శీను – పోసాని – రఘుబాబులతో చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు సీక్వెన్స్ కూడా నవ్వించలేకపోయింది. ఫైనల్ గా ఈ సినిమా నిడివి కూడా చాలా ఎక్కువ కావడం ఈ సినిమాకి మైనస్..
సాంకేతిక విభాగం :
మీరు సినిమా చూసినంతసేపూ విజువల్స్ గ్రాండ్ గా ఉంటేనే ఆడియన్స్ కి చూడాలనే ఆసక్తి కలుగుతుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉండేలా చూపించిన క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ కే దక్కిందని చెప్పాలి. కెవి గుహన్ మహేష్ బాబు, తమన్నాలతో పాటు ప్రతి ఒక్కరినీ ప్రతి లొకేషన్ ని చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా బళ్ళారి ఎపిసోడ్ లో ఆయన చూపించిన విజువల్స్ ఫెంటాస్టిక్ గా వచ్చాయి. ఓవరాల్ గా కెవి గుహన్ లేకపోతే ఈ సినిమా విజువల్స్ అంత గ్రాండ్ గా ఉండేవి కావేమో. ఇక తమన్ అందించిన పాటలు పిక్చరైజేషన్ పరంగా ఇంకా హిట్ అయ్యాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అన్ని పాటలకి డాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ రక్షిత్ స్టెప్స్ బాగున్నాయి.
ఇకపోత ఎంఆర్ వర్మ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా బాగా స్పీడ్ గా అనిపించినా, సెకండాఫ్ లో మాత్రం స్లో అయ్యింది. ఒకటి రెండు ఎపిసోడ్స్ దగ్గర తప్ప మిగతా అంతా స్లోగా నడుస్తుంది. సెకండాఫ్ లో చాలా పార్ట్స్ కట్ చేయాల్సింది. రైటర్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన అనిల్ రావిపూడి – ప్రవీణ్ వర్మ – ఉపేంద్ర వర్మ పంచ్ డైలాగ్స్ విత్ ప్రాస ఉండాలి అనే కాన్సెప్ట్ ని పక్కన పెట్టి ట్విస్ట్ ల మీద వర్కౌట్ చేసి ఉంటే బాగుండేది. శ్రీను వైట్ల డైరెక్షన్ బాగుంది. నటీనటులకి కొత్త పాత్రలు రాసుకున్నారు బాగుంది, వాటిని బాగా తీసారు బాగుంది. ఇవన్నీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి నటే ఓ స్ట్రాంగ్ పాయింట్ లేదా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే అన్నా ఉండాలి. ఈ చిన్న లాజిక్ ని శ్రీను వైట్ల మరచిపోయాడు, అందుకే ఆయన గత సినిమాల రెగ్యులర్ ఫార్మాట్ లోనే సెకండాఫ్ ని తీసి బోర్ కొట్టించారు. ఇకనైనా ఆయన ఆ జోనర్ నుంచి బయటకి వస్తే బాగుంటుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారి నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి.
తీర్పు :
చాలా కాలం నుంచి టాలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మహేష్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆగడు’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ ‘ఆగడు’ ఆ రేంజ్ అంచనాలను అందుకోలేకపోవడంలో కొంతవరకూ విఫలమైంది. దానికి ప్రధాన కారణం శ్రీను వైట్ల అనే చెప్పాలి, ఎందుకంటే తన ఓల్డ్ ఫార్మాట్ లోనే ఉండేలా ఎంచుకున్న కథ – కథనం. మహేష్ బాబు ఒక్కడే సినిమా మొత్తం తన కొత్త యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. మహేష్ బాబుకి తోడుగా తమన్నా గ్లామర్, కొంతమంది కమెడియన్స్ కామెడీ, కొన్ని పంచ్ డైలాగ్స్ మరియు శృతి హాసన్ స్పెషల్ సాంగ్ సినిమాకి హెల్ప్ అయ్యాయి. సెకండాఫ్ ని యాసిటీజ్ ‘దూకుడు’ ఫ్లేవర్ లో కాకుండా, కొంతైనా కొత్తగా ట్రై చేసి ఉంటే అనుకున్న స్థాయి కంటే పెద్ద హిట్ అయ్యేది. మహేష్ బాబుకి మంచి మార్కెట్ ఉండడం, ప్రస్తుతం ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందించే పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేకపోవడం వలన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కమర్షియల్ గా స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం ఉంది…